గంజాయి నమ్మలేని నిజాలు

V6 Velugu Posted on Nov 28, 2021

చాలా దేశాల్లో గంజాయి సాగు చేస్తున్నా..వాడుతున్నా మన  దేశంలో ప్రత్యేకంగా ఒక ఊర్లో పండిన గంజాయికి ఫుల్​ డిమాండ్‌‌‌‌ ఉంటుంది. అమెరికాలో దీన్ని పెట్స్‌‌‌‌కి కూడా ఇస్తుంటారట. గంజాయి గురించి ఇలాంటి వింతైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని.. 

లంగ్‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ రాకుండా.. 
ఒక రీసెర్చ్‌‌‌‌లో పొగతాగే వాళ్లతో పోలిస్తే వారానికి ఒకట్రెండు సార్లు గంజాయి తీసుకునే వాళ్లలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయని తేలింది. ఈ రీసెర్చ్ బర్మింగామ్‌‌‌‌లోని అలబామా యూనివర్శిటీ వాళ్లు చేశారు. గంజాయి తీసుకునేవాళ్లలో ఎక్స్‌‌‌‌టర్నల్‌‌‌‌ బ్లోయింగ్‌‌‌‌ ఫోర్స్ ఎక్కువగా ఉన్నట్టు సైంటిస్ట్‌‌‌‌లు చెప్పారు. ఇలా ఉండడం వల్ల లంగ్‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ వచ్చే అవకాశాలు తక్కువ. ఇందులోని కన్నబినాయిడ్స్ నొప్పి, వికారం తగ్గిస్తాయి. అయితే.. ఎప్పుడో ఒకసారి తీసుకున్న వాళ్లు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా తీసుకుంటే విషం కంటే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. 

సమాధిలో గంజాయి
కొన్ని దేశాల సంప్రదాయాల ప్రకారం.. మనిషి చనిపోతే అతనికి ఇష్టమైన వస్తువులను శవంతోపాటు సమాధిలో పూడ్చిపెడతారు. అయితే.. చైనాలో ఒకాయనకు గంజాయి అంటే బాగా ఇష్టమేమో! అతని సమాధిలో గంజాయి కూడా పూడ్చిపెట్టారు. 2016 అక్టోబరులో రీసెర్చర్లు గంజాయి ఆకులు కప్పి ఉన్న 35 ఏండ్ల వ్యక్తి సమాధిని కనుగొన్నారు. ఇది చైనాలోని యాంఘై స్మశానవాటికలో ఉంది. సమాధిలో ఉన్న వ్యక్తి ఛాతిపై 13 గంజాయి మొక్కలు ఉన్నాయి. దాదాపు 2,400 నుంచి 2,800 సంవత్సరాల మధ్య ఆ శవాన్ని పూడ్చి ఉంటారని సైంటిస్ట్‌‌‌‌లు చెబుతున్నారు. కాకపోతే..   అలా గంజాయితో పూడ్చారు అనేదానికి కారణం ఇప్పటికీ తెలియలేదు. 

పొగాకు కంటే తక్కువ 
లిమిట్‌‌‌‌గా తీసుకుంటే ఆల్కహాల్, పొగాకు కన్నా గంజాయి ఆరోగ్యానికి తక్కువ హాని చేస్తుందని కొందరు సైంటిస్ట్‌‌‌‌లు చెబుతున్నారు. పైగా పొగాకులా గంజాయిలో నికోటిన్ కూడా ఉండదు. కాకపోతే గంజాయి తీసుకున్నప్పుడు ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తాయి. కానీ.. మందు తాగినప్పుడు పెద్దగా మార్పులు కనిపించవు. 

గిన్నిస్‌‌‌‌ రికార్డు
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనగానే గంజాయిని పండించినందుకో, ఎక్కువగా తీసుకున్నందుకో వచ్చింది అనుకుంటున్నారా? కానే కాదు. ఎక్కువగా సీజ్‌‌‌‌ చేసినందుకు ఈ రికార్డు క్రియేట్‌‌‌‌ అయింది. 1982లో అమెరికా, కొలంబియా గవర్నమెంట్లు కలిసి 14 నెలల పాటు ఒక ఆపరేషన్‌‌‌‌ చేసి దాదాపు 2,903 మెట్రిక్‌‌‌‌ టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. ప్రపంచంలో ఒకే ఆపరేషన్‌‌‌‌లో ఇంతలా సీజ్‌‌‌‌ చేయడం ఇదే మొదటిసారి. ఇది అప్పట్లో అమెరికాలో సంవత్సరంలో వాడే గంజాయిలో ఐదో వంతు. దీనికి ‘‘ఆపరేషన్ టిబురాన్” అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా 495 మందిని అరెస్టు చేశారు. 95 బోట్లను స్వాధీనం చేసుకున్నారు. 

నెంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌ క్వాలిటీ
హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌లోని కులు జిల్లాలోని మలానా లోయలో హై క్వాలిటీ గంజాయి పండిస్తున్నారు. ఇక్కడ దొరికే గంజాయిని ‘మలానా క్రీమ్’ అని పిలుస్తారు. ఈ లోయలో ఉండేవాళ్లు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ వారసులని చెబుతుంటారు. ఈ ఊరు డ్రగ్‌‌‌‌ టూరిజానికి కేరాఫ్‌‌‌‌ అడ్రస్‌‌‌‌గా మారింది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు గంజాయి సాగుకు చాలా అనుకూలమైనవి. అందుకే క్వాలిటీ గంజాయి పండుతోంది. ఈ గంజాయిలో టీహెచ్‌‌‌‌సీ (టెట్రా హైడ్రో కనాబినల్) చాలా ఎక్కువ. దీనికి మార్కెట్‌‌‌‌లో చాలా రేటు పలుకుతోంది. ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి పది గ్రాములకు మూడు వేల నుంచి పది వేల రూపాయల వరకు అమ్ముతున్నారు.  

Tagged marijuana, himachalpradesh, Number one quality marijuana, Cannabis in the grave

Latest Videos

Subscribe Now

More News