
సుప్రీంకోర్టులో నుపుర్ శర్మకు తాత్కాలిక ఊరట లభించింది. నుపుర్ ను ఇప్పట్లో అరెస్టు చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.జస్టిస్ సూర్యకాంత్, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మానం ఈ తీర్పు నిచ్చింది. ఆగస్టు 10వ తేదీన మళ్లీ నుపుర్ శర్మ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది. దేశవ్యాప్తంగా తనపై నమోదైన తొమ్మిది కేసులను ఒకే కేసుగా మార్చాలని నుపుర్ శర్మ సుప్రీంకోర్టును కోరగా, ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టింది. నుపుర్ శర్మ చేసిన కామెంట్స్ వల్ల దేశంలో పలు చోట్లల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఉదయ్‌పూర్‌లో అయితే ఓ వ్యక్తిని ఏకంగా చంపేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి నుపుర్ శర్మ సస్పెండ్ కు గురైన సంగతి తెలిసిందే.