
- వచ్చేఏడాది నుంచి మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి
- పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- ప్రతి స్కూల్ ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలి
- స్టూడెంట్లకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచన
హైదరాబాద్. వెలుగు: రాష్ట్రంలో నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకూ కొత్త స్కూళ్లను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఆయా స్కూళ్లలో కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్ తో ముందుకు పోవాలని చెప్పారు.శుక్రవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.
సర్కారు బడుల్లో మెరుగైన వసతుల కల్పనకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి స్కూల్ ను కా ర్పొరేట్ తరహాలో తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ప్లే గ్రౌండ్ తో పాటు అవసరమైన క్లాస్ రూంలు, మంచి వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ బడులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.
దీనికోసం విద్యాశాఖ పరిధిలోని స్థలా లను గుర్తించాలని ఆదేశించారు. సరైన సౌకర్యాలు లేని బడులను దగ్గరలో అందుబాటులోని సర్కారు స్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. పేదలకు మెరుగైన విద్యను అందించడమే సర్కారు లక్ష్యమని వెల్లడించారు. సర్కారు స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్),ఇంటర్మీడియెట్ లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహణ విజయవంతం కావడంపై ఆయా శాఖ అధికారులను సీఎం అభినందించారు.
ఈ కార్య క్రమంలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్ట నవీన్ నికోలస్, టీడబ్ల్యూఈడీసీ ఎండీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..
ఓయూ హామీలపై యాక్షన్ ప్లాన్ ఏది?
ఆగస్టునెలాఖరులో ఉస్మానియా యూనివర్సిటీ పర్య టన సమయంలో ఇచ్చిన హామీల యాక్షన్ ప్లాన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇప్పటి వరకూ దానిపై స్పష్టత ఇవ్వకపోవడంపై కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. ఓయూను ప్రపంచస్థాయి వర్సిటీగా మార్చేందుకు ఇన్ ఫ్రాస్ట్రక్స ర్ తోపాటు అకాడమిక్ ప్లాన్అవ్వాలని విద్యాశాఖ సె క్రటరీ యోగితారాణాను ఆదేశించారు. ఈ వారంలో దీనికోసం వేసిన కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానున్నదని సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు.
ఫీజులపై మరోసారి రివ్యూ
ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ఫీజులపైనా సీఎం రేవంత్ సమీక్షించారు. ఫీజుల పెంపు విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. సర్కారుపై ఎక్కువ బర్డెన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తా నియాతో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫీజుల పెంపుపై అవసరమైతే మరోసారి రివ్యూ చేసుకోవాలని ఆదేశించారు.