మసాలాలతో డయాబెటిస్ కంట్రోల్ చేస్కోవచ్చు

మసాలాలతో డయాబెటిస్ కంట్రోల్ చేస్కోవచ్చు

మధుమేహం (డయాబెటిస్) అనేది ప్రపంచం మొత్తాన్ని వేధిస్తోన్న సాధారణ, తీవ్రమైన సమస్య. దీన్ని నయం చేయడం కష్టమైనప్పటికీ, అసాధ్యమైతే కాదు. మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితో మధుమేహాన్ని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అనేక ఆహార నియమాలు పాటించాలంటున్నారు. అయితే అవి పాటించడానికి పెద్ద కష్టమేం కాదు. రోజూ వారి వంటలలో ఉపయోగించే సాధారణ మసాలా దినుసులతో కూడా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చని డైటీషియన్ కనుప్రీత్ అరోరా సింగ్ అంటున్నారు. 

1. మెంతులు: 

మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీని వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. వీటిని రోజూవారి వంటల్లో ఉపయోగిస్తే మంచి ఫలితముంటుంది. మధుమేహం ఉన్న వారు తాము తీసుకునే ఆహారంలో మెంతి గింజలను కలిపి తిండే అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ విటమిన్ అండ్ న్యూట్రిషన్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. 10 గ్రాముల మెంతి గింజలను వేడి నీటిలో నానబెట్టి తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు.

2. దాల్చిన చెక్క 

దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. దాంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. దాల్చినచెక్కలో సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని వల్ల ఇది సువాసనను మాత్రమే కాకుండా అత్యంత ఆరోగ్య-ప్రయోజన లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలను ఎదుర్కోవటానికి దాల్చినచెక్క యాంటీ-డయాబెటిక్ ఏజెంట్‌గా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 6 గ్రాముల దాల్చిన చెక్కను ప్రతి రోజూ లేదా 40 రోజులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను అరికట్టడంలో సహాయకారి నిలుస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఓట్ మీల్, పాన్‌కేక్‌లలో దాల్చిన చెక్క పొడిని కూడా చల్లుకోవచ్చని డైటీషియన్ కనుప్రీత్ స్మూతీస్ సూచిస్తున్నారు. లేకపోతే బిర్యానీ, గ్రేవీస్ వంటి భారతీయ వంటకాల్లో వీటిని విరివిగా వాడొచ్చని అంటున్నారు. 

3. పసుపు:

పసుపులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడి, అనారోగ్యాన్ని దూరం చేస్తాయి. దీన్ని రోజువారీ భోజనంలో చేర్చడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. పసుపులో ఉండే కర్కుమిన్.. రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించి మధుమేహం లాంటి ఇతర లక్షణాలను కంట్రోల్ చేయగలదని ఓ సర్వేలో తేలింది. పసుపు పాలు తాగడం కూడా మంచి ఆరోగ్యానికి గొప్ప మార్గం.

4. లవంగాలు: 

ఈ మసాలా దినుసులు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఘాటైన వాసనను కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. వీటిని రోజూ వారి ఆహారంలో ఉపయోగించే పప్పులు, సబ్జీలతో పాటు లవంగాలను కూడా చేర్చవచ్చు. అంతే కాదు.. లవంగాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి.

5. అల్లం:

అల్లం ఆరోగ్యానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇది డయాబెటిస్ డైట్‌లో ఉండాల్సిన గొప్ప మసాలా దినుసుగా పరిగణించబడుతుంది. జర్నల్ ఆఫ్ ఎత్నిక్ ఫుడ్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో అల్లం ఫాస్టింగ్ సీరం గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీన్ని టీ, రోజూ వారి ఆహారం, లోదా అల్లం ఆలే వంటి పానీయాలలో కూడా చేర్చవచ్చని డైటీషియన్ కనుప్రీత్ సూచిస్తున్నారు.