ఎయిర్ పోర్ట్ మెట్రోకు భూసామర్థ్య పరీక్షలు స్టార్ట్

ఎయిర్ పోర్ట్ మెట్రోకు భూసామర్థ్య పరీక్షలు స్టార్ట్

ఎయిర్ పోర్ట్ మెట్రోకు భూసామర్థ్య పరీక్షలు స్టార్ట్

హైదరాబాద్, వెలుగు : ఎయిర్ పోర్ట్ మెట్రో కోసం భూసామర్థ్య పరీక్షలు ప్రారంభించినట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోమవారం వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే అలైన్మెంట్ స్థిరీకరణ, పెగ్ మార్కింగ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఐకియా జంక్షన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు వంద మెట్రో పిల్లర్లను నమూనాగా తీసుకొని భూసామర్థ్య పరీక్షలు చేపట్టామన్నారు. ఈ పనులు పూర్తవడానికి 2 నెలల సమయం పట్టొచ్చని తెలిపారు.

ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల టెండర్ ప్రక్రియలో పాల్గొనే బిడ్డర్లకు భూమి తీరుపై అవగాహన కలగడంతో పాటు తగిన ఆర్థిక అంచనాలు రూపొందించుకోవచ్చన్నారు. పనులను చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, సూపరింటెండెంట్ ఇంజినీర్ సాయప రెడ్డి నేతృత్వంలోని హెచ్ఏఎంఎల్ ఇంజినీరింగ్ బృందం పర్యవేక్షిస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్, ట్రాఫిక్ పోలీస్ తదితర శాఖల సమన్వయంతో పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.