ఇండ్లు లేని పేదలను కేసీఆర్ మోసం చేస్తుండు

ఇండ్లు లేని పేదలను కేసీఆర్ మోసం చేస్తుండు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలను కేసీఆర్ 9 ఏండ్లుగా  మోసం చేస్తున్నడని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్  ప్రభాకర్ ఆరోపించారు.  ఇండ్ల పేరిట పేదలను నమ్మించటం, మోసం చేయటం  ఆయనకు  అలవాటుగా మారిందని విమర్శించారు. డబుల్ ఇండ్లకు పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద నిధులిస్తున్నా కేంద్రం వాటా లేదని చెబుతూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. 

ఇండ్ల మీద పీఎం ఆవాస్ యోజన లోగో  కూడా  ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. లబ్ధిదారుల ఎంపికలో  పారదర్శకత లోపించిందన్నారు. ఇండ్ల డ్రాలో అవకతవకలు జరుగుతున్నాయని వెల్లడించారు.ఈ అంశంపై  త్వరలో గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని ప్రభాకర్ తెలిపారు. లబ్ధిదారుల లిస్ట్ లు ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో లేవని,   రూ. 3 లక్షలు  లంచం ఇచ్చిన వారికే ఇండ్లు కేటాయించారని చెప్పారు. ఇతర రాష్ర్టాల్లో లక్షల ఇండ్లు నిర్మిస్తుంటే..ఇక్కడ మాత్రం చాలా తక్కువ నిర్మాణాలు జరిగాయని ప్రభాకర్  పేర్కొన్నారు.