Cricket World Cup 2023: బంగ్లాను భయపెట్టిన న్యూజిలాండ్ బౌలర్లు.. కివీస్ ముందు స్వల్ప లక్ష్యం

Cricket World Cup 2023: బంగ్లాను భయపెట్టిన న్యూజిలాండ్ బౌలర్లు.. కివీస్ ముందు స్వల్ప లక్ష్యం

వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. కివీస్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయిన బంగ్లా బ్యాటర్లు.. న్యూజిలాండ్ ముందు 246 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఆ మాత్రం స్కోరైనా చేశారంటే.. అది ముష్ఫికర్ రహీం చలువే. ఈ వెటరన్ బ్యాటర్ 66 పరుగులతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం (66) హాఫ్ సెంచరీ చేయగా.. ఆ జట్టు కెప్టెన్ షకీబ్ ఉల్ హసన్ (40), మహ్మదుల్లా(41) పరుగులతో పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాఖీ పెర్గుసన్ 3 వికెట్లు తీసుకోగా.. ట్రెంట్ బోల్ట్, మ్యాట్ హెన్రీ చెరో 2 వికెట్ల చొప్పున.. గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ స్యాంట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు.