
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న హీరోయిన్ నయనతార మరో మహిళా ప్రాధాన్యత సినిమాతో రాబోతుంది. ఇటీవల కన్మణి రాంబో ఖతీజా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నయన్.. లేటెస్ట్ గా "02" అనే సినిమాతో రానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార లీడ్ రోల్ నటించిన ఈ మూవీని విఘ్నేష్ తెరకెక్కించాడు. డీస్నీ+హాట్ స్టార్ లో విడుదలకానున్న ఈ సినిమా టీజర్ సోమవారం రిలీజైంది. ఓ బస్సు కొన్ని మీటర్ల లోతు ఊబిలో కురుకోపోవటం.. అక్కడ ఓపికగా ఉంటే..12 గంటల వరకు జీవించే అవకాశం ఉండటం...ఇలాంటి సమయంలో..ఈ బస్సులో ఎలాంటి సంఘటనలు జరిగాయి. చివరికి..బస్సులోని వారు రక్షించబడ్డారా? లేదా ? అనేది ఈ మూవీ టీజర్ లో తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ లాంటి భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి ఫస్ట్ ఆక్సిజన్ అనే టైటిల్ అనుకున్నారట కానీ.. ఇంగ్లీష్ పదాలతో ఆడియన్స్ కి ఈజీగా రీచ్ అవుతుందని 02 అని ఫిక్స్ చేసినట్లు యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు.
#O2 Teaser ?for you all?#O2Teaser? https://t.co/2LLVx7x8tH#O2onHotstar #O2TheFilm
— Nayanthara✨ (@NayantharaU) May 16, 2022