రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వివాదం : స్పీకర్ కు బీజేపీ కంప్లయింట్

రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వివాదం : స్పీకర్ కు బీజేపీ కంప్లయింట్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ 'అనుచితంగా ప్రవర్తించారని' భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ స్మృతి ఇరానీ తీవ్ర ఆరోపణలు చేశారు. మణిపూర్ హింసాకాండలో ప్రభుత్వం 'భరతమాతను' చంపిందని రాహుల్ గాంధీ ఆరోపించిన తర్వాత.. స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడి వెళ్లిపోయే ముందు.. తనను చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ విషయాన్ని సభలోనే ప్రస్తావించటం సంచలనంగా మారింది.

రాహుల్ గాంధీని 'స్త్రీద్వేషి' అని పిలిచిన స్మృతి ఇరానీ.. తనకు భయంగా ఉందని,  రాహుల్ తన పట్ల తప్పుగా ప్రవర్తించారన్నారు. స్త్రీ ద్వేషి పురుషుడు మాత్రమే మహిళా పార్లమెంటేరియన్‌లకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలడని చెప్పారు. పార్లమెంటులో స్త్రీలు...ఇలాంటి సందర్భం మునుపెన్నడూ చూడలేదు. ఇది అతను స్త్రీల గురించి ఏమనుకుంటున్నాడో చూపిస్తుంది. ఇది అసభ్యకరమైనది" అని ఆమె వ్యాఖ్యానించారు.

 

ఈ ఆరోపణలపై బీజేపీ మహిళా మంత్రులు, ఎంపీలు స్పీకర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధికారులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు సమాచారం.