ఓసీ కమిషన్ కోసం వచ్చే నెల 27న మహాదీక్ష : ఏనుగు సంతోష్ రెడ్డి

ఓసీ కమిషన్ కోసం వచ్చే నెల 27న మహాదీక్ష : ఏనుగు సంతోష్ రెడ్డి
  • తెలంగాణ ఓసీ సంక్షేమ
  • సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: జాతీయ స్థాయిలో ఓసీల స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓసీ కమిషన్ సాధనకై ఫిబ్రవరి 27న జంతర్ మంతర్ వద్ద మహాదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఓసీల్లోని పేద కుటుంబాలకు ఫీజు రీయింబర్స్​మెంట్​తో కూడిన విద్య, ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్​చేశారు.

ఓసీ అభ్యర్థులకు అన్ని పోటీ పరీక్షల్లో అర్హత మార్కులు తగ్గించాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కాలపరిమితిని ఐదేండ్లకు పెంచాలన్నారు. ఫిబ్రవరి 25న ఢిల్లీకి హైదరాబాద్​నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని చెప్పారు. దీక్షకు ఓసీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి కాచం సత్యనారాయణ గుప్త, గౌరవ అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, ప్రతినిధులు పాల్గొన్నారు.