
పఠాన్ చెరు : గులాబి తోట క్షుద్ర పూజలు కలకలం రేపిన సంఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పఠాన్ చేరు మండలం నందిగామ గ్రామంలో పూల రాజు గులాబీ తోటలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారని పులరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తన పొలంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గులాబీ తోటలో అనుమానాస్పదంగా తిరిగారని తెలిపాడు.
వారిని గమనించి ఇక్కడ ఏమి చేస్తున్నారని నిలధిస్తే.. పూజ కోసం పూలు కొస్తున్నామని చెప్పి వెళ్లి పోయారని, తీరా గమనిస్తే తోటలో క్షుద్ర పూజకు సంబంధించిన సామాగ్రి ఉందన్నాడు రైతు. క్షద్ర పూజల జరిగినట్లు గుర్తించిన రైతు గ్రామస్థులకు సమాచారం అందించానని తెలిపాడు. విషయం తెలుసుకున్న – బానుర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.