కాళీమాత ఆలయ భూములను ఆక్రమించారు: రాజాసింగ్‌

కాళీమాత ఆలయ భూములను ఆక్రమించారు: రాజాసింగ్‌

హైదరాబాద్ పాతబస్తీలోని ఉప్పుగూడలో ఉన్న కాళీమాత ఆలయ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆలయ భూములను ఆక్రమించారని ఆరోపించారు. దేవాలయం భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని… ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాళీమాత భూముల కబ్జా వెనుక డీసీపీ ప్రమేయం ఉందన్నారు.

ఉప్పుగూడలోని సర్వే నంబర్ 24, 25, 26లలో ఏడు ఎకరాల 13 గుంటల భూమిపై పెద్ద గొడవే జరుగుతోంది. ఆలయ ట్రస్ట్ తనకు భూమి అమ్మిందని చెపుతూ పోలీసుల సాయంతో మజ్లిస్ పార్టీ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు రాజాసింగ్. మూడు సార్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే  బీజేపీ కార్యకర్తలు, స్థానికులు అడ్డుకున్నారన్నారు. దేవాలయ భూమిన కాపేండుకు వెళ్లిన తమ పార్టీ  కార్యకర్తను, మహిళలపై  డీసీపీ దగ్గరుండి లాఠీ ఛార్జ్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత కలహాలు సృష్టించి.. ఆ నెపాన్ని బీజేపీపై వేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. పాతబస్తీలో మత కలహాలు సృష్టించాలని పోలీసులే ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజాసింగ్.