
జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహాల కదలికల కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితమవుతాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అక్టోబర్ మాసంలో 2 వ తేదీన దసరా పండుగ రోజు బుధుడు ..కుజుడు సంయోగం.. తులా రాశిలో జరగబోతుంది.ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఏ రాశి వారికి ఎలా ఉంది.. ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం. . .!
మేష రాశి: ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో మొదటి 15 రోజులు ( 1 వ తేది నుంచి 15 వ తేది వరకు ) కెరీర్, వ్యక్తిగత పరంగా చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో ఉద్యోగులు కార్యాలయంలో కొత్త అవకాశాలను పొందుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఇక చివరి 15 రోజులు ( 16 వ తేది నుంచి) అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు. ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్ట్ లు వచ్చినట్టే వచ్చి.. చేజారిపోతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయాలి.
పరిహారం : నిత్యం దుర్గామాతను పూజించండి.. లలితా సహస్రనామం.. చదవడం కాని..శ్రద్దగా వినడం కాని చేయండి . అంతా మంచే జరుగుతుంది.
వృషభ రాశి: ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో సానుకూల ఫలితాలొస్తాయి. గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు మొదటి 15 రోజుల కాలంలో ( 15 వ తేది వరకు) అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడి పెట్టే ఈ 15 రోజులు చాలా అనుకూలమని పండితులు సూచిస్తున్నారు. ఇక చివరి 15 రోజులు ( 16 వతేది నుంచి) కూడా పెద్దగా ఎలాంటి మార్పులు ఉండవు కాని.. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం డ్రైవింగ్ అప్రమత్తంగా ఉండాలి. ఆహారం విషయంలో కూడా శ్రద్ద తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
పరిహారం : నిత్యం ఓం నమ:శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించండి అంతా మంచే జరుగుతుంది.
మిథునరాశి: ఈ రాశి వారు అక్టోబర్ మాసం చివరి రోజుల్లో విశేష ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభంలో ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ..చికాకులు ఉంటాయి. ప్రతి పనిలో కూడా ఆలస్యం జరుగుతుంది. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేయాలో తెలియని పరిస్థితులు మొదటి 15 రోజులు ( 15 వతేది వరకు) ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇక 16 వ తేది నుంచి కొత్త తరహా ఆలోచనలకు అమలు పరచడంతో మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలొస్తాయి. మీరు అందరికంటే విభిన్నంగా పని చేస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారస్తులు లాభాల బాట పడతారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కలసి వస్తాయి. కెరీర్ పరంగా ప్రశంసలు లభిస్తాయి.జాబ్మారాలనుకునే వారికి అక్టోబర్ నెల చివరి 15 రోజులు చాలా మంచి సమయమని పండితులు చెబుతున్నారు. వృత్తిలో విజయం సాధిస్తారు.
పరిహారం : సూర్యష్టకం.. నవగ్రహస్తోత్రంతో పాటు అంగారక రుణ విమోచన స్తోత్రాన్ని పఠించండి అంతా మంచే జరుగుతుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారు అక్టోబర్ మాసంలో వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. మొదటి వారంలో ( 1 నుంచి 7 వ తేది వరకు) ఉద్యోగస్తులు పాత ప్రాజెక్టుల నుంచి లాభాలు పొందుతారు. ప్రయోజనం పొందొచ్చు. రెండో వారంలో అంటే 15 వ తేది వరకు ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలకే గొడవలు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ నెల రెండో వారంలో ఈ రాశి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు.
ఇక చివరి 15 రోజులు ( 16 వ తేది నుంచి) ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వస్తాయి. ఆస్తివివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. పోటీ పరీక్షలు రాసేవారు ఈ సమయంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
పరిహారం : ఈ రాశి వారు ఉదయం.. సాయంత్రం మర్రి చెట్టు వేర్లపై తియ్యటి పాలను పోయండి. అంతా మంచే జరుగుతుంది. మీకు అవకాశం లేకపోతే.. మీ కుటుంబసభ్యలు మీ వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని మీ పేరు చెప్పి పోయండి .. అంతే ఫలితం కలుగుతుంది.
సింహ రాశి: ఈ రాశి వారు అక్టోబర్ నెలలో మొదటి వారంలో ( 1 నుంచి 7 వ తేది వరకు ) సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. పెద్ద ప్రాజెక్టుల బాధ్యతను పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. రెండో వారంలో 15 వతేది వరకు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఖర్చులను నియంత్రించుకోవాలి.వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది.
చివరి 15 రోజులు ( 16 వ తేది నుంచి) చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అయినా అవి అంతగా ప్రభావం చూపవు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగస్తులు .. చేతివృత్తివారు వృత్తిపరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోవడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
పరిహారం : ఈ రాశి అక్టోబర్ నెలలో ప్రతి శనివారం క్రమం తప్పకుండా శని భగవానుడికి తైలాభిషేకం..నల్ల నువ్వులతో పూజ చేసి దేవాలయంలో ఎండిన కొబ్బరికాయను పొట్టుతో దానం చేయండి. అంతా మంచే జరుగుతుంది.
కన్యా రాశి: ఈ రాశి వారు అక్టోబర్ నెలలో శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొదటి 15 రోజుల (1 వ తేది నుంచి 15 వ తేది వరకు) కాలంలో మీరు ప్రశంశలు అందుకుంటాఈరు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.వ్యాపారాలలో లాభాలు వస్తాయి భూములకు సంబంధించిన సానుకూల ఫలితాలు చూస్తారు. పూర్వీకుల నుండి ఆస్తి కలసి వస్తుంది. చివరి 15 రోజులు ( 16 వతేది నుంచి) ఖర్చులపై శ్రద్ధ పెట్టాలి. ఆహారం విషయంలో శ్రద్ద తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితిలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు ఆందోళన కలిగించే అవకాశం ఉంది.
పరిహారం : ఈ రాశి వారు అక్టోబర్ నెలలో శివాలయంలో రుద్రాభిషేకం చేసి.. పేదలకు బెల్లంతో పాటు వస్త్ర దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు.
తులా రాశి : ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో చాలా శుభ ఫలితాలుంటాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. కెరీర్ పరంగా శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులు అనుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. అక్టోబర్ నెల మొదటి వారంలో ( 1–7 వ తేది వరకు ) కేరీర్ పరంగా.. వ్యాపార పరంగా అంతా మంచే జరుగుతుంది. సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇక రెండో వారంలో రోజుల( 8 వ తేదీనుంచి14 వరకు) సమయంలో వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఆర్థికవిషయాల్లో తీసుకునే నిర్ణయాలు లాభాలను తెచ్చి పెడతాయి. కొత్తగా విలువైన వస్తువులు ( భూమి,ఇల్లు, వాహనం) కొనుగోలు చేయడం గాని.. అమ్మడం కాని జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పెళ్లి కోసం ఎదురుచేసే వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
మూడో వారంలో మధ్యలో అంటే 15 వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలి. ఈ 10 రోజులు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. కొంతమంది వల్ల ఇబ్బందులు.. అవమానాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆన్ లైన్ ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
చివరి వారంలో ( 22 వతేదీనుంచి) సామాజిక సేవలో పాల్గొంటారు. అన్ని పరిస్థితులు సానుకూలపడతాయి. ఆధ్యాత్మిక విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. క్రమేణ ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు సూచిస్తున్నారు.
పరిహారం : శివాష్టకాన్ని పఠించండి అంతా మంచే జరుగుతుంది.
వృశ్చిక రాశి : అక్టోబర్ నెల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఎవరిని నమ్మవద్దు.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న మోసపోయే అవకాశాలున్నాయి. ఈ నెల మొదటి వారంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన కొన్ని సమస్యలు వస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రెండో వారంలో పరిస్థితులు కొంతమేర కుదుటపడతాయి. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి చెప్పినా తప్పుగా అర్దం చేసుకుంటారు. బంధువులు.. స్నేహితులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది.
మూడు.. నాలుగు వారాల్లో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగస్తులకు.. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. అయితే ప్రతి విషయంలో సీక్రసీని మెయిన్టైన్ చేయండి. శత్రువులు కూడా మిత్రులుగా వ్యవహరిస్తారు. జీవితంలో పురోగతి మరియు లాభం కోసం మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
పరిహారం : ఈ నెలలో ప్రతిరోజు ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి .. అంతా మంచే జరుగుతుంది.
ధనస్సురాశి : ఈ రాశి వారు ఈ నెలలో మొదటి 15 రోజులు ( 1–15 వ తేదీవరకు) ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో, జాగ్రత్తగా వాహనం నడపండి మరియు మీ ఆరోగ్యం మరియు విలువైన వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ 15 రోజులు ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి.. సహోద్యోగుల నుంచి సహకారం ఉండదు. అయినా సరే చాలా ఓర్పు.. సహనాన్ని పాటించండి. వ్యాపారస్తులకు లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది. అయితే చివరి 15 రోజులు ( 16 వ తేది నుంచి) చాలా అనుకూలంగా ఉంటాయి. మొదటి 15 రోజుల కష్టానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు. గతంలో మిమ్మలను వ్యతిరేకించిన వారు మిమ్మలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు వస్తాయి. అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు.. తోటి ఉద్యోగుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. జాబ్ మారాలనుకునే వారికి చివరి 15 రోజులు చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.
పరిహారం : విష్ణు సహస్రనామం పఠించండి .. అంతా మంచే జరుగుతుంది.
మకర రాశి : ఈ రాశి వారికి అక్టోబర్ నెల గుడ్ న్యూస్ లతో ప్రారంభం అవుతుంది. వ్యాపారం.. ఉద్యోగ రంగాల్లోని వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు పరిష్కారం అవుతాయి. ఈ నెల మొదటి 15 రోజులు ( 1 వతేది నుంచి 15 వ తేది వరకు) గతంలో ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఉద్యోగస్తులు కేరీర్ విషయంలో.. వ్యాపారరస్తులు .. తీసుకునే నిర్ణయాలు జీవితంలో కీలకం కానున్నాయని పండితులు చెబుతున్నారు. కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలమని పండితులు సూచిస్తున్నారు.
చివరి 15 రోజులు ( 16 వ తేది నుంచి) కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో లాభాలు తగ్గే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న మద్దతు తగ్గుతుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆస్తి వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి..
పరిహారం : శివ చాలీసాను పారాయణం చేయండి అంతా మంచే జరుగుతుంది.
కుంభ రాశి : ఈ రాశి వారికి అక్టోబర్ నెల మిశ్రమంగా ఉంటుంది. కష్టాలు.. సుఖాలు.. లాభాలు.. నష్టాలు సమానంగా ఉంటాయి. ఈ నెల మొదటి 15 రోజులు ( 1 నుంచి 15 వ తేది వరకు) కేరీర్ పరంగా.. వ్యాపార పరంగా.. ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో కీలకపాత్ర పోషిస్తారు. గతంలో మీతో ( కుంభరాశి వారితో) గొడవపడిన వారు.. మీ సహాయాన్ని కోరే అవకాశాలున్నాయి. కుటుంబసభ్యుల మధ్య ఉన్న వివాదాలు మధ్యవర్తి ద్వారా పరిష్కారమవుతాయి.
చివరి 15 రోజులు( 16 వ తేది నుంచి) ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కెరీర్ పరంగా.. వ్యాపార పరంగా ఆందోళన పడే అవకాశాలున్నాయి. ప్రేమ.. పెళ్లి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మళ్లీ చివరి వారంలో పరిస్థితులు అదుపులోకి వస్తాయి.
పరిహారం : నిత్యం హనుమాన్చాలీసా.. ఆదిత్య హృదయం పఠించండి అంతా మంచే జరుగుతుంది.
మీన రాశి : ఈ రాశి వారు అక్టోబర్ నెలంతా కొంచెం బిజీగా ఉంటారు. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు పనిభారం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెలంతా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికవిషయాల్లో ఒక అడుగు వెనక్కు.. రెండడుగులు ముందుకు వేసిన విధంగా ఉంటుంది. అనవసర ఖర్చులు.. ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులు అవమానాలకు గురయ్యే అవకాశం ఉంది. పని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి మీ పనిని ఇతరులకు అప్పగించవద్దు. ప్రేమ.. పెళ్లి విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి.
పరిహారం : నారాయణ కవచాన్ని పారాయణం చేయండి. ఉపశమనం కలుగుతుంది.