ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పెద్దపల్లి, వెలుగు: ఓదెల భ్రమరాంబ మల్లికార్జుణస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పెద్దపట్నంతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాలతో పూర్తవుతాయి. 

బ్రహోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒగ్గు కళాకారులచే  రాత్రిపూట పెద్దపట్నం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం నుంచే ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.