కాకతీయ మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

కాకతీయ మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

పర్వతగిరి (గీసుకొండ),వెలుగు:  హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో  కాకతీయ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్ర) పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగమైన కాకతీయ మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను   భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం  ప్రారంభించారు.ఈ సందర్భంగా  ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాకతీయ మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్ పరిధిలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా  కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అడిషనల్​ కలెక్టర్లు  రెవెన్యూ జి.సంధ్య రాణి,   వై వి గణేష్,  జడ్పీ సీఈవో రామ్ రెడ్డి లు ,జోనల్ మేనేజర్ స్వామి, సంగెం తహసీల్దార్ రాజ్ కుమార్  తిలకించారు.

అలాగే.. సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్,  విద్యుత్​ లైన్లు,    ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కలెక్టర్ ప్రారంభించారు.వీటి  ద్వారా  టెక్స్టైల్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నాణ్యమైన విద్యుత్ సరఫరా  జరుగుతుందని   పేర్కొన్నారు.   జోనల్ మేనేజర్ స్వామి మాట్లాడుతూ .. కాకతీయ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్ నిర్మాణానికి  రూ. 1,695 కోట్లను అంచనా  ఉండగా..    దాదాపు రూ. 800 నుంచి రూ. 900 కోట్లు వివిధ అభివృద్ధి పనులు,  మౌలిక సదుపాయాల కల్పనతో పాటు భూసేకరణ పనుల కోసం ఖర్చు చేసినట్లు  తెలిపారు.

 పీఎం మిత్ర పథకం కింద రూ. 200 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించగా   ఇందులో  నుంచి  రూ. 30 కోట్ల నిధులను రెండు నెలల క్రితం వివిధ అభివృద్ధి పనుల కోసం విడుదల చేసిందని,  మిగిలిన రూ.170 కోట్ల నిధులను దశల వారీగా విడుదల చేయనున్నట్లు జోనల్ మేనేజర్ స్వామి వెల్లడించారు.