వన్డే ప్రపంచకప్ టికెట్ల ధరలు వచ్చేశాయ్

వన్డే ప్రపంచకప్ టికెట్ల ధరలు వచ్చేశాయ్

ఇండియా వేదికగా 2023 వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ మెగా ఈవెంట్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ ఇప్పటికే  రిలీజ్ చేసింది.  2023 ఆక్టోబర్‌ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్‌ జరగనుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఆక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ  మెగా ఈవెంట్ స్టార్ట్ కానుండగా,   ఆక్టోబర్‌ 8న చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఇండియా తొలి మ్యాచ్ ను ఆడనుంది. ఆక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థి పాక్ తో  ఇండియా తలపడనుంది.  

వన్డే ప్రపంచకప్‌ 2023 భారత్‌లోని పది వేదికల్లో జరగనుంది. ఇందులో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ కూడా ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో 5 లీగ్‌ మ్యాచ్‌లతో పాటు సెమీ ఫైనల్‌ 2 కూడా జరగనుంది. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ ధరలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) వెల్లడించింది. ప్రతి మ్యాచ్ కు టికెట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈడెన్ మైదానంలో జరిగే అన్ని మ్యాచ్‌ల ధరలు రూ. 650 నుంచి రూ. 3000 వరకు ఉన్నాయి. 

Bangladesh vs Netherlands:

  • అప్పర్ టైర్స్ రూ.650.
  • D , H బ్లాక్‌లకు రూ.1000.
  • B, C, K, L బ్లాక్‌లకు రూ.1500.

England vs Pakistan 

  • అప్పర్ టైర్స్ రూ.800.
  • డి, హెచ్ బ్లాక్‌లు రూ.1200
  • సి, కె, బ్లాక్‌లు రూ.2000
  • BL బ్లాక్‌లు రూ.2200
Bangladesh vs Pakistan
 
  • అప్పర్ టైర్స్ రూ.800
  • డి, హెచ్ బ్లాక్‌లు రూ.1200
  • సి, కె, బ్లాక్‌లు రూ.2000
  • BL బ్లాక్‌లు రూ.2200

India vs SA and Semi-final matches

  • అప్పర్ టైర్స్ రూ. 900.
  • డి, హెచ్ బ్లాక్‌లు రూ.1500
  • సి, కె, బ్లాక్‌లు రూ.2500
  • BL బ్లాక్‌లు రూ.3000