అయ్యయ్యో ఆ ముక్కలు లేవే!: పాక్ క్రికెటర్ల ఫుడ్ మెనూలో అదిరిపోయే వంటకాలు

అయ్యయ్యో ఆ ముక్కలు లేవే!: పాక్ క్రికెటర్ల ఫుడ్ మెనూలో అదిరిపోయే వంటకాలు

వన్డే ప్రపంచ కప్‌ పోరు కోసం భారత పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ జట్టుకు వస్తున్న ఆదరణ, అతిథి మర్యాదులు చూస్తుంటే ఔరా అనిపించక మానదు. ఇక వారి ఫుడ్ మెను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పాకిస్తాన్ క్రికెట్ జట్టు బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బసచేస్తోంది. ఈ క్రమంలో వారికి వడ్డిస్తున్న వంటకాల ఫుడ్ మెనూ వెల్లడైంది. అందులో ఒక్కటి తప్ప.. చికెన్, మటన్ నుంచి గ్రిల్డ్ ఫిష్ వరకు ఎన్నో ఘుమఘుమలాడే వంటకాలు ఉన్నాయి. 

నో బీఫ్ 

ప్రపంచ కప్‌లో పాల్గొనే ఏ జట్టుకు ఆహారంలో బీఫ్ వడ్డించరు. ఈ ఒక్కటే వారి ఫుడ్ మెనూలో లేదు. ఈ క్రమంలో వారు ప్రోటీన్ కోసం చికెన్, మటన్, చేపలపై ఆధారపడాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్ల కోసం పాక్ క్రికెటర్లు స్టేడియంలో ఉన్న చెఫ్‌ను ఉడికించిన బాస్మతి బియ్యం, స్పఘెట్టి బోలోగ్నీస్ సాస్, వెజిటేరియన్ పులావ్ వండమని అడిగారు. కాగా, వార్మప్ మ్యాచ్‌లు, ప్రధానమ్యాచ్‌లు ఉప్పల్ వేదికగానే ఉన్నాయి కనుక.. పాకిస్తాన్ జట్టు మరో రెండు వారాల పాటు హైదరాబాద్‌లోనే ఉండనుంది.

ALSO READ: ఇండియాకు రానన్నాడు.. మళ్లీ వచ్చాడు: వరల్డ్ కప్‍కు 31 మంది కామెంటేటర్లు

పాకిస్తాన్ వరల్డ్ కప్ జట్టు: ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సాద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఉసామా మిర్, షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ.