జీడిమెట్లలో లేబర్ కాంట్రాక్టర్ ఆత్మహత్య .. మృతుడు ఒడిశా వాసి

 జీడిమెట్లలో లేబర్ కాంట్రాక్టర్ ఆత్మహత్య .. మృతుడు ఒడిశా వాసి

జీడిమెట్ల, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఓ లేబర్ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మురళిగౌడ్​తెలిసిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన లూనామేది(45) జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. సూరారం ఇండస్ట్రియల్​ ఏరియాలోని హట్​సన్​మిల్క్​కంపెనీలో ఎనిమిదేండ్లుగా లేబర్ కాంట్రాక్టర్​గా పని చేస్తున్నాడు. ఇతని వద్ద 20 మంది కార్మికులు పని చేస్తున్నారు. కాగా కొంతకాలంగా లూనామేది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. 

ఈ నేపథ్యంలో కంపెనీ 3 నెలలుగా డబ్బులు చెల్లిస్తున్నా వాటిని కార్మికులకు ఇవ్వడం లేదు. వారు తమ జీతాలు ఇవ్వాలని అడగడంతో మనస్తాపానికి గురయ్యాడు. కంపెనీకి చెందిన లేబర్ అడ్డాలో ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.