తండ్రిపై కలెక్టర్ కు కూతురు కంప్లైంట్ : ప్రభుత్వం నాకిచ్చే భోజనం మా నాన్న మింగేస్తున్నాడు

తండ్రిపై కలెక్టర్ కు కూతురు కంప్లైంట్ : ప్రభుత్వం నాకిచ్చే భోజనం మా నాన్న మింగేస్తున్నాడు

ఓ ఆరేళ్ల బాలిక తన తండ్రిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. కరోనా కారణంగా ఒడిశా ప్రభుత్వం మధ్యాహ్నా భోజన పథకాన్ని ఆన్ లైన్ లో విద్యార్ధులకు అందేలా కృషి చేస్తుంది. ఇందులో భాగంగా విద్యార్ధులకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ కు లేదంటే గార్డియన్ గా ఎవరుంటే వారి బ్యాంక్ అకౌంట్ లో రూ.8లన్ని ట్రాన్స్ ఫర్ చేస్తుంది. దీంతో పాటు ప్రతీ రోజు 150గ్రాముల బియ్యాన్ని  పాఠశాలల్లో విద్యార్ధులకు అందిస్తుంది.

అయితే ఈ నేపథ్యంలో ఒడిశాలోని కేంద్రపాడ జిల్లాకు చెందిన ఓ ఆరేళ్లబాలిక ప్రభుత్వం తనకు ఇచ్చే మిడ్ డే మీల్ స్కీమ్ లోని 150గ్రాముల బియ్యంతో పాటు, ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసే రూ.8లన్ని గార్డియన్ ఉన్న తన తండ్రి అక్రమంగా తీసుకుంటున్నారంటూ ఫిర్యాదు చేసింది.

రెండేళ్ల క్రితం తన తల్లిచనిపోవడంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని, రెండో భార్యతో ఎక్కడో ఉంటున్న తన తండ్రి తనని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి తీరుతో విసుగెత్తి  మామయ్య ఇంట్లో ఉండి చదువుకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఇక బ్యాంక్ అకౌంట్ పనిచేస్తున్నా సరే..గార్డియన్ పేరుతో తన తండ్రి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశారని, దీంతో ప్రభుత్వం పంపే ఆ రూ.8 అకౌంట్ లో పడడం లేదని వాపోయింది. మధ్యాహ్నాం స్కూల్ లో  పంపిణీ చేసే 150గ్రాముల బియ్యాన్ని తనకు తెలియకుండా నా పేరు చెప్పి తండ్రి తీసుకెళుతున్నాడని  కేంద్రపాడ జిల్లా కలెక్టర్ సామ్రాత్ వర్మకు చెప్పింది.

బాలిక ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్.. మిడ్ డే మీల్ లో అందించే బియ్యం, డబ్బులు బాలిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక కుమార్తె పేరు చెప్పి బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు, తీసుకున్న బియ్యాన్ని తండ్రి నుంచి రికవరీ చేసి బాలికకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.