ఒడిశా సీఎంకు గ్లోబల్ సమిట్ ఆహ్వానం..స్వయంగా వెళ్లి అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి

ఒడిశా సీఎంకు గ్లోబల్ సమిట్ ఆహ్వానం..స్వయంగా వెళ్లి అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు: ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్-2047​ గ్లోబల్ సమిట్​కు హాజరుకావాలని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజిహ్​ను రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆహ్వానించారు. మంత్రి శనివారం భువనేశ్వర్​వెళ్లి సెక్రటేరియెట్​లో సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం సీఎంను శాలువాతో సత్కరించారు.