
- నగరంలో ఆమెపై ఐదు కేసులు
- ఒడిశా వెళ్లి పట్టుకు వచ్చిన స్పెషల్ టీమ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఐదు గంజాయి కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఒడిశాకు చెందిన లేడీ డాన్ సంగీత సాహును స్పెషల్ ఎక్సైజ్టీమ్ఆ రాష్ట్రానికి వెళ్లి అరెస్ట్‌చేసింది. సికింద్రాబాద్ లో గంజాయి రవాణా చేస్తుండగా ఒక కేసు, ధూల్‌పేటలో లేడీ పెడ్లర్లకు గంజాయి సరఫరా చేసిన నాలుగు కేసుల్లో సంగీత నిందితురాలుగా ఉంది. ఒడిశాలోని కుర్థా జిల్లా కాళీకోట్కు చెందిన సంగీత సాహు నాలుగేండ్లుగా హోల్సేల్గంజాయి దందాచేస్తోంది.
భువనేశ్వర్‌కు దగ్గరగా ఉండడంతో అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో డీలింగ్స్పెంచుకుంది. 2022లో గంజాయి సప్లయ్చేస్తూ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు చిక్కి చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవించింది. జైళ్లో ఉన్నప్పుడు ధూల్‌పేటలో గంజాయి అమ్మి జైళ్లో ఉన్న శీలాబాయి, నేహాబాయి, ఇషికా సింగ్‌తో పరిచయం పెంచుకుంది. బయటకు వచ్చాక వారికి గంజాయి సప్లయ్చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమెపై నాలుగు కేసులు నమోదయ్యాయి.
పరారీలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసస్ రెడ్డి స్పెషల్‌టీమ్‌ను ఒడిశా పంపించారు. ఎస్టీఎఫ్–ఈ టీమ్‌లీడర్ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి కిలోమీటర్ల దూరంలో కాళీకోట్ వెళ్లి అరెస్టు చేసి తీసుకువచ్చారు. కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.