రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. 10 గంటల నుంచి 10.20 వరకు విరామం ఉంటుంది. ప్రభుత్వం ఈ దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు పదో తరగతి పరీక్షలూ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో స్కూళ్లలో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.