
న్యూఢిల్లీ: అమెజాన్ ఈ నెల 12–14 తేదీల మధ్య నిర్వహిస్తున్న ప్రైమ్ డే సేల్సందర్భంగా కస్టమర్లకు పలు ఆఫర్లు ఇస్తున్నట్టు అమెజాన్ పే ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై 10శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.
ఈ తగ్గింపులు ఈఎంఐ లావాదేవీలపై కూడా వర్తిస్తాయి. అమెజాన్ పే యూపీఐతో కనీసం రూ.1,000 విలువైన రెండో కొనుగోలుపై రూ.100 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అర్హులైన వినియోగదారులకు అమెజాన్ పే లేటర్ ద్వారా రూ.60 వేల వరకు లోన్, అలాగే రూ.600 విలువైన వెల్‌కమ్ రివార్డులు లభిస్తాయి.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే ఐదుశాతం క్యాష్‌బ్యాక్ తో పాటు, అదనంగా మరో 5శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. కొత్తగా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునేవారికి రూ.మూడు వేల విలువైన ప్రయోజనాలు, నాన్-ప్రైమ్ సభ్యులకు రూ.రెండువేల విలువైన వెల్‌కమ్ రివార్డులు ఇస్తామని అమెజాన్ పే తెలిపింది.