గ్రూప్1 ఎగ్జామ్ డ్యూటీలో ఉండగానే బీరు తాగిన ఆఫీసర్

గ్రూప్1 ఎగ్జామ్ డ్యూటీలో ఉండగానే బీరు తాగిన ఆఫీసర్
  • కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో ఘటన 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గ్రూప్1 ఎగ్జామ్ డ్యూటీలో ఉండగానే ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ బీరు తాగుతూ పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం గ్రూప్–1 ఎగ్జామ్ జరగ్గా ఐడెంటిఫికేషన్ ఆఫీసర్​గా పర్వేజ్ బాధ్యతలు నిర్వహించాడు. అభ్యర్థులు పరీక్షా హాల్​లోకి వెళ్లాక ఆయన బీరు తీసుకుని బస్టాండ్​లో తాగుతూ కూర్చున్నాడు. 

ఆయన మెడలో ఎగ్జామ్ డ్యూటీకి సంబంధించిన ట్యాగ్ ను గుర్తించిన పోలీసులు పీఎస్ కు తరలించారు. అనంతరం విచారించగా తన డ్యూటీ 10.30కే అయిపోయిందని తెలిపాడు. కాగా, పర్వేజ్​కు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయగా 170% రీడింగ్ చూపించింది.