డబ్బుల కోసం కాన్ఫరెన్స్ ను స్టార్​ హోటల్​ లో పెట్టారు

డబ్బుల కోసం కాన్ఫరెన్స్ ను స్టార్​ హోటల్​ లో పెట్టారు

స్టూడెంట్స్ అరెస్ట్

డిచ్​పల్లి, వెలుగు : నిజామాబాద్​ తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ​కాన్ఫరెన్స్​ని క్యాంపస్​లో కాకుండా  ప్రైవేట్​ హోటల్​లో పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం స్టూడెంట్స్ ​వర్సిటీ గేట్లకు తాళం వేశారు. పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా 15 మందిని అరెస్ట్ ​చేసి డిచ్​పల్లి పీఎస్​కు తరలించారు.  స్టూడెంట్​ లీడర్లు మాట్లాడుతూ కాన్ఫరెన్స్​ వర్సిటీలో నిర్వహిస్తే స్టూడెంట్స్​కి ఉపయోగపడేదని, కానీ..డబ్బుల కోసం వర్సిటీ ఆఫీసర్లు స్టార్​ హోటల్​ లో పెట్టారన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై వీసీ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.