పశువుల కాపర్లను వాగు దాటించిన గజ ఈతగాళ్లు

పశువుల కాపర్లను వాగు దాటించిన గజ ఈతగాళ్లు

కాగజ్ నగర్, వెలుగు: పశువులను మేపేందుకు వెళ్లిన కాపరులు వరద ప్రవాహంతో వాగు అవతల చిక్కుకుపోగా ఆఫీసర్లు వారిని కాపాడారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన పది మంది యువకులు గురువారం ఉదయం పశువులను మేత కోసం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. ఇంతలో భారీ వర్షం కురిసి కృష్ణపెళ్లి వాగు పొంగింది. దాంతో పశువుల కాపరులు వాగు అవతల  చిక్కుకుపోయారు. గ్రామస్తులకు ఫోన్​చేసి చెప్పడంతో పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన  తహసీల్దార్ జమీర్, ఎస్సై వెంకటేశ్, ఆర్ఐ అచ్యుతరావు, స్థానిక సర్పంచ్ వడ్డేపల్లి లావణ్య శ్రీనివాస్, వీఆర్వో కాంతయ్య అక్కడకు చేరుకున్నారు. స్థానిక గజ ఈతగాళ్లతో కలిసి తాళ్ల సహాయంతో పశువుల కాపరులను ఇవతలి ఒడ్డుకు సురక్షితంగా తీసుకొచ్చారు.