
పటాన్ చెరు,వెలుగు: మైనర్ కి జరుగుతున్న బాల్యవివాహాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్న ఘటన పటాన్ చెరులో జరిగింది. వివరాల్లోకి వెళి తే..జిన్నారం మండలంలోని సొలక్ పల్లి గ్రామానికి చెందిన మైనర్(16) బాలికకు, తాండూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడి(28)తో పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించారు.
శుక్రవారం పటాన్ చెరులోని రామాలయంలో పెళ్లి జరుగుతోందన్న విషయం
తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడి కి చేరుకున్నారు. తహసీల్దార్, ఎల్ డీపీవో, సీఐ నరేష్, ఐసీడీఎస్ సీడీపీవో చంద్రకళ, సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, జిల్లా బాలల రక్షణ సమితి అధికారి శ్రవణ్ కుమార్ ఈ పెళ్లిని అడ్డుకున్నారు. యువకుడికి, మైనర్ బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి
పంపించారు.