
హైదరాబాద్, వెలుగు: ప్రీమియం కో–వర్కింగ్బ్రాండ్ఆఫీక్స్ హైదరాబాద్‌లోని రాయదుర్గంలో మంగళవారం మొదటి ఫ్లాగ్షిప్ ఆఫీస్‌స్పేస్‌ను ప్రారంభించింది. గ్లోబల్డిజైన్తో రూపొందించిన ఈ బిల్డింగ్12వ అంతస్తులో ఉంటుందని, స్థానిక అవసరాలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దామని కంపెనీ తెలిపింది.
ఒక్కో యూజర్‌కు 100 చదరపు అడుగుల జాగాను కేటాయిస్తామని తెలిపింది. హైదరాబాద్‌లో ప్రీమియం, ఫ్లెక్సిబుల్ఆఫీసులకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. వ్యాపారవేత్తలు, స్టార్టప్‌లు, పెద్ద కంపెనీల అవసరాలను తీర్చడానికి ఇది అనువుగా ఉంటుందని ఆఫీక్స్ వివరించింది.
ఈ ఏడాది మొదటి క్వార్టర్లో నగరంలో 1.82 మిలియన్ చదరపు అడుగుల ఆఫీసు జాగా అమ్ముడుపోయింది. ఏడాది క్రితం మొదటి క్వార్టర్‌తో పోలిస్తే ఇది రెట్టింపు.