
సదాశివనగర్, వెలుగు : జూనియర్ కాలేజీల అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ కృషి చేస్తుందని ఉమ్మడి జిల్లా ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాలేజీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4 వేల మంది విద్యార్థులను చేర్పించాలని టార్గెట్ ఉండగా, ఇప్పటి వరకు 3350 మంది విద్యార్థులు కొత్తగా చేరినట్లు తెలిపారు.
కాలేజీ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 16 లక్షలు మంజూరు చేసిందన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కామారెడ్డి ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలాం, ప్రిన్సిపాల్ సింగం శ్రీనివాస్, డివిజనల్ లో ని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఎఖినొద్దీన్, నారాయణ, యూసుఫ్, గంగారాం, శంకర్, నరేందర్, జ్యోతిర్మయి పాల్గొన్నారు.