త్వరలో హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం..కసరత్తు చేస్తున్న అధికారులు

త్వరలో హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం..కసరత్తు చేస్తున్న అధికారులు
  • హైదరాబాద్, జడ్చర్ల, గద్వాలలో 1,250 ప్లాట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హౌసింగ్  బోర్డు ప్లాట్లను వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో వివాదాలు, లేని ప్లాట్ల వివరాలను రెడీ చేశారు. త్వరలో నోటిఫికేషన్  ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వేలం ద్వారా  భారీ రెవెన్యూ వస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చిన ఫండ్స్ ను ఇందిరమ్మ స్కీమ్​కు ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్,  జోగుళాంబ గద్వాల, జడ్చర్లతో పాటు పలు జిల్లా కేంద్రాల్లో ప్లాట్లను వేలం వేయాలని హౌసింగ్  బోర్డు నిర్ణయించింది. అధికారులు గుర్తించిన ప్లాట్లకు కోర్టు వివాదాలు, కేసులు లేనివి, కమర్షియల్  ఏరియాల్లో ఉన్నవి ఈ లిస్ట్ లో ఉన్నాయి. మొత్తం 1250 జాగాలు ఉండగా 3.22 లక్షల చదరపు గజాల విస్తీర్ణం ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ లో కూకుట్ పల్లి సమీపంలోని ఖైతలాపూర్ లోనే 250కి పైగా ప్లాట్లు ఉన్నాయి. కాగా, ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ మొదటి దశలో భాగంగా పూరన్తయిన ఇండ్లకు వచ్చే నెల 2 రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఇళ్ల గృహ ప్రవేశం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో హౌసింగ్  బోర్డుకు రూ.వేల కోట్ల విలువైన వందల ఎకరాల ల్యాండ్స్, ప్లాట్స్  ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. ప్లాట్ల చుట్టూ గోడలు, ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు  చేస్తున్నారు. అవి హౌసింగ్  బోర్డు భూములు అని బోర్డులు పెడుతున్నారు.