మహిళలకు 15 జడ్పీలు.. రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు

మహిళలకు 15 జడ్పీలు.. రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు
  • ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు కూడా

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా పరిషత్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ పోస్టులకు సంబంధించి మహిళా రిజర్వేషన్ల కోసం లక్కీడ్రా తీశారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పీఆర్ కార్యాలయంలో డైరెక్టర్ ​సృజన ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. దీనికి 30 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. వారి సమక్షంలోనే జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లా పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఎన్నికలు జరగనుండగా, వాటిలో 15 జడ్పీలను మహిళలకు కేటాయించారు. అలాగే ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు కూడా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టరేట్లలో లక్కీ డ్రా తీశారు. కాగా, రాష్ట్రంలోని 31 జడ్పీల చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్​సృజన శనివారం గెజిట్ జారీ చేశారు. 31 జడ్పీల్లో ఎస్టీలకు 4 , ఎస్సీలకు 6,  బీసీలకు 13 జిల్లాలు రిజర్వ్ అయ్యాయి. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో 8 జిల్లాలు ఉన్నాయి. 

జిల్లాల వారీగా రిజర్వేషన్ల జాబితా ఇదీ.. 

జిల్లా పరిషత్    రిజర్వేషన్​
1. ఖమ్మం    ఎస్టీ (పురుషులు/మహిళలు)
2. ములుగు    ఎస్టీ (మహిళలు)
3. నల్గొండ    ఎస్టీ (మహిళలు)
4. వరంగల్    ఎస్టీ (పురుషులు/మహిళలు)
5. హనుమకొండ    ఎస్సీ (మహిళలు)
6. జనగామ    ఎస్సీ (మహిళలు)
7. జోగులంబ గద్వాల    ఎస్సీ (పురుషులు/మహిళలు)
8. రాజన్న సిరిసిల్ల    ఎస్సీ (పురుషులు/మహిళలు)
9. రంగారెడ్డి    ఎస్సీ (మహిళలు)
10. సంగారెడ్డి    ఎస్సీ (పురుషులు/మహిళలు)
11. జయశంకర్ భూపాలపల్లి    బీసీ  (పురుషులు/మహిళలు)
12. కరీంనగర్    బీసీ  (పురుషులు/మహిళలు)
13. కుమ్రంభీం ఆసిఫాబాద్    బీసీ (పురుషులు/మహిళలు)
14. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్    బీసీ (మహిళలు)
15. మంచిర్యాల    బీసీ (మహిళలు)
16. నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్    బీసీ (మహిళలు)
17. నిర్మల్    బీసీ (పురుషులు/మహిళలు)
జిల్లా పరిషత్    రిజర్వేషన్
18. నిజామాబాద్    బీసీ (మహిళలు)
19. సిద్దిపేట    బీసీ (పురుషులు/మహిళలు)
20. సూర్యాపేట    బీసీ (పురుషులు/మహిళలు)
21. వికారాబాద్    బీసీ (పురుషులు/మహిళలు)
22. వనపర్తి    బీసీ (మహిళలు)
23. యాదాద్రి భువనగిరి    బీసీ (మహిళలు)
24. ఆదిలాబాద్    అన్​రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ (మహిళలు)
25. భద్రాద్రి కొత్తగూడెం    అన్​రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ 
(పురుషులు/మహిళలు)
26. జగిత్యాల    అన్​రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ (మహిళలు)
27. కామారెడ్డి    అన్​రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్ 
(పురుషులు/మహిళలు)
28. మహబూబాబాద్    అన్​రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్​
(పురుషులు/మహిళలు)
29. మెదక్    అన్​రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్ 
(పురుషులు/మహిళలు)
30. నారాయణపేట    అన్​రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్​(మహిళలు)
31. పెద్దపల్లి    అన్​రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్ (మహిళలు)