గొర్రెల స్కాం : విచారణకు సహకరించని అధికారులు

గొర్రెల స్కాం : విచారణకు సహకరించని అధికారులు

గొర్రెల స్కామ్ లో దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. 700కోట్ల రూపాయలు అవినీతి జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ పై దృష్టి పెట్టింది ఈడీ. పథకం అమలులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆధారాలు గుర్తించారు అధికారులు. స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని  పశు సంవర్ధక శాఖ అధికారులకు లేఖ పంపింది ఈడీ. 

గొర్రెల పంపిణీలో జరిగిన స్కామ్ గురించి విచారించే ఏసీబీ అధికారులకు మాజీ ఎండీ రామ్ చందర్ నాయక్, ఓ ఎస్డీ కళ్యాణ్ కుమార్ సహకరించలేదు. మూడు రోజుల కస్టడీ విచారణ పూర్తి కావడంతో వారిని తిరిగి చంచల్ గూడ జైలుకు పంపించారు అధికారులు.