
హైదరాబాద్ లో సెప్టెంబర్ 17 నుంచి మూడు రోజులు హెచ్ఎండీఏ కి చెందిన 103 ప్లాట్లకు ఈ వేలం వేయనున్న అధికారులు . ఇవాళ తుర్కయంజాల్ లో ఉన్న 12 ప్లాట్లకు ఈ ఆక్షన్ నిర్వహించనున్నారు హెచ్ఎండీఏ అధికారులు. 600 నుంచి 1146 గజాల వరకు ఉన్న ప్లాట్ల ప్రారంభ ధర గజానికి 65 వేలు నిర్ణయించారు అధికారులు.
సెప్టెంబర్ 18న బాచుపల్లి లో ఉన్న 70 ప్లాట్లకు ఆన్లైన్ లో వేలం వేయనుంది హెచ్ఎండీఏ , 266 నుంచి 500 గజాల వరకు ఉన్న ప్లాట్ల ప్రారంభ ధర గజానికి 70 వేలు నిర్ణయించారు అధికారులు. సెప్టెంబర్ 19 న కోకాపేట, పుప్పాలగూడలో ఉన్న ప్లాట్లకు ఈ వేలం వేయనున్నారు అధికారులు
కోకాపేటలో గజానికి లక్షా 75 వేలు, పుప్పలగూడలో గజానికి లక్షా 20 వేలు ప్రారంభ ధరగా నిర్ణయించింది హెచ్ఎండీఏ. ఇప్పటికే ఈ వేలానికి సంబంధించిన ప్రి బిడ్ సమావేశాలు నిర్వహించి వివరాలు తెలిపారు అధికారులు.
►ALSO READ | నెల రోజులు కాల్పులు బంద్.. చర్చలకు సిద్ధం!
మహా నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్ల అమ్మకాలు చేపడుతోంది హెచ్ఎండీఏ. ఔటర్రింగ్రోడ్కు ఇవతల, అవతల హెచ్ఎండీఏ పెద్దమొత్తంలో ల్యాండ్ పూలింగ్ద్వారా రైతుల నుంచి భూములను సేకరించి అభివృద్ధి చేసింది. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు కల్పించి లేఅవుట్లు సిద్ధం చేసింది. రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేశాక అందులో 60 శాతం ఆయా రైతులకు ఇచ్చి, మిగిలిన 40 శాతం భూములను హెచ్ఎండీఏ తీసుకుంటోంది. ఇలా తీసుకున్న భూముల్లో వందల సంఖ్యలో ప్లాట్లు ప్రస్తుతం హెచ్ఎండీఏ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏ ఆర్థిక పరిస్ధితి దిగజారిపోవడంతో తన వద్ద ఉన్న భూములను వేలం వేయడం ద్వారా నిధులను సేకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్లాట్లను వేలం వేస్తోంది హెచ్ఎండీఏ