
పంజగుట్ట,వెలుగు: మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో మంగళవారం ప్రజావాణికి అవుట్సోర్సింగ్స్టాఫ్నర్సులు, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్అభ్యర్థులు, భూ సంబంధిత సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు ఇచ్చారు. బీఆర్ఎస్పాలనలో తమకు అన్యాయం జరిగిందని, కొత్త ప్రభుత్వంలోనైనా న్యాయం చేయాలని కోరారు. నోడల్అధికారి దివ్య దేవరాజన్ పర్యవేక్షణలో జరిగిన ప్రజావాణికి మొత్తం 1,588 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు చెప్పారు.