ఈవీఎంలు, వీవీ ప్యాట్లను భద్రపరిచిన అధికారులు..

ఈవీఎంలు, వీవీ ప్యాట్లను భద్రపరిచిన అధికారులు..

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన EVMలు,వీవీ ప్యాడ్స్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని  మినీ స్టేడియంకు చేరుకున్నాయి. పోలీస్ సెక్యూరిటీ మధ్య ప్రత్యేక వాహనంలో  328 బ్యాలెట్ ఈవీఎంలు, 368 వీవీ ప్యాడ్స్, 328 కంట్రోల్ యూనిట్స్ తీసుకొచ్చారు అధికారులు. షాద్ నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు, ఫరూక్ నగర్ మండల రెవెన్యూ అధికారి పార్థసారథి, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో EVMలు,వీవీ ప్యాడ్ లను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. 

ఈ సందర్భంగా వెంకట మాధవ రావు మాట్లాడుతూ 328 బ్యాలెట్ ఈవీఎంలు, 368వీవీ ప్యాట్లు,328 కంట్రోల్ యూనిట్స్ పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణతో పాటు ప్రత్యేక కేంద్ర బలగాలతో రక్షణ ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రత పరిచి గదులను సీజ్ చేశామన్నారు. పోలింగ్ రోజు మాత్రమే ఈవీఎంలు, వీవీ ప్యాట్లను నియోజకవర్గంలో ని 252 పోలింగ్ కేంద్రాలకు  తరలిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవ రావు తెలిపారు.