వరంగల్ జిల్లాలో కాలం చెల్లిన ఐస్ క్రీమ్స్ విక్రయం

వరంగల్ జిల్లాలో కాలం చెల్లిన ఐస్ క్రీమ్స్ విక్రయం

కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు కాసుల కక్కుర్తి కోసం వరగంల్ జిల్లాలో కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్స్ కాలం చెల్లినవి దుకాణాల్లో విక్రయిస్తున్నారు. వాటికి ఎలాంటి పర్మీషన్ లేకుండా ఐస్ క్రీమ్ తయారీ పధార్థాలు విక్రయిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ,ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. 

కాలం చెల్లిన ఐస్ క్రీం తయారీ సామాగ్రిని అధికారులు పట్టుకున్నారు. యజమాని షాపులో వ్యాలిడిటీ అయిపోయిన పదార్థాలను సీజ్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వ్యాపారికి 20 వేల రూపాయాల జరిమానా విధించారు. వ్యాలిడిటీ అయిపోయిన పదార్థాలతో తయారు చేస్తున్న ఐస్ క్రీములతో అనారోగ్యం బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఐస్ క్రీమ్ తయారీ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.