బంగారం అక్రమ రవాణా.. రాజీవ్​ గాంధీ ఎయిర్​పోర్టులో ఎంత పట్టుబడిందంటే.. ?

బంగారం అక్రమ రవాణా.. రాజీవ్​ గాంధీ ఎయిర్​పోర్టులో ఎంత పట్టుబడిందంటే.. ?

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.కోటి విలువైన 1705.3 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. వారు తెలిపిన వివరాల ప్రకారం..  

ఇండిగో ఫ్లైట్ 6E-1484లో దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు అడ్డుకున్నారు. తనిఖీ చేయగా  వారి పురుషనాళంలో బ్లాక్ టేప్‌తో చుట్టి బంగారు పేస్ట్‌తో కూడిన ఆరు క్యాప్సూల్స్‌ను దాచిపెట్టినట్లు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని  వారిరువురిని అరెస్ట్​ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.