ఎన్నికల వేళ రూ. 756 కోట్లు సీజ్.. 226 మంది అభ్యర్థులపై కేసులు

ఎన్నికల వేళ రూ. 756 కోట్లు సీజ్..  226 మంది అభ్యర్థులపై కేసులు
  • ఎన్నికల వేళ రూ. 756 కోట్లు సీజ్
  • 226 మంది అభ్యర్థులపై కేసులు
  • కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్ గా సోదాలు!
  • వాళ్ల బంధువు ఇండ్లలోనూ తనిఖీలు   

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో అధికారులు భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. చెక్  పోస్టులు, విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో  రూ. 756 కోట్లను ఎన్నికల కమిషన్ సీజ్ చేసింది. ఎన్నికల కోడ్‌లో ఐటీ, ఈడీ, పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. పెద్దగా అధికార పార్టీ కి చెందిన నగదు సీజ్ కాకపోవడం వెనుక ఉన్న మర్మం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

అధికారులు ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థులు, వారి బంధువుల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన 226 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.