విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి : కలెక్టర్ అశోక్ కుమార్

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి :  కలెక్టర్ అశోక్ కుమార్

మహాముత్తారం/ వెంకటాపూర్​ (రామప్ప), వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులు సూచించారు. శుక్రవారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం కస్తూర్భా గాంధీ గురుకుల విద్యాలయాన్ని అడిషనల్​ కలెక్టర్​ అశోక్​ కుమార్​ ఆకస్మిక తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా వసతులు, భోజనం, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, రిజిస్టర్లు, వంటశాల పరిశుభ్రతను పరిశీలించారు. ఆహార మెనూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం రామాంజాపూర్​ చెంచు కాలనీలోని బాలికల ఆశ్రమ పాఠశాలను తహసీల్దార్​ గిరిబాబు తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డించిన ఆహార పదార్థాలను పరిశీలించారు.