ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలి : ఎన్నికల పరిశీలకులు,

ఉమ్మడి వరంగల్ జిల్లాలో  ఎన్నికలు పారదర్శకంగా జరగాలి : ఎన్నికల పరిశీలకులు,

జనగామ/ ములుగు/ జయశంకర్​భూపాలపల్లి/ తాడ్వాయి, వెలుగు: జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శంగా జరగాలని ఆయా జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఆఫీసర్లు సూచించారు. శనివారం జనగామ జిల్లా ఐడీవోసీ ఆఫీస్​లో మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్, జనగామ జిల్లా ఎన్నికల ఆఫీసర్​, కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ హాజరై మార్గనిర్దేశం చేశారు.

 ములుగు కలెక్టరేట్​లో నిర్వహించిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు, ఆయిల్ ఫెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ పలు సూచనలు చేశారు. పోలింగ్​కు సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు.

 శిక్షణలో పోలింగ్‌కు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ పరిశీలన, సీరియల్ నంబర్ల నమోదు, పోలింగ్ కేంద్ర ప్రవేశ నియంత్రణ, ఓటర్ల గుర్తింపు, ఇండిలేబుల్ సిరా గుర్తు వేయడం, ఓటర్ల నమోదు ప్రక్రియలు, వికలాంగులు, వృద్ధుల సహాయం, పోలింగ్ కేంద్రం చుట్టూ ప్రచారం లేదా ఒత్తిడుల పరిశీలన వంటి అంశాలపై  మైక్రో అబ్జర్వర్లకు విస్తృత అవగాహన కల్పించారు.

  జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం రైతువేదికలో ప్రిసైడింగ్​ అధికారులు, స్టేజి–2 అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్​ రాహుల్​ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో ఆర్​వోలు, ఏఆర్​వోలు, పీవోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ సంపత్​రావు పాల్గొని ఎన్నికల బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు.