Fire accident : డెక్కన్ మాల్ కూల్చివేతకు రంగం సిద్ధం

Fire accident : డెక్కన్ మాల్ కూల్చివేతకు రంగం సిద్ధం

సికింద్రాబాద్ ఫైర్ యాక్సిడెంట్ లో దెబ్బతిన్న బిల్డింగ్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. శ్లాబు పెచ్చులు ఊడుతుంటడంతో భవనం ఏ క్షణమైనా కూలిపోయే అవకాశముంది. దీంతో భవనాన్ని కూల్చడం తప్ప గత్యంతరం లేదని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. బిల్డింగ్ డెమొలిషన్ కు రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయించారు. ముంబై నుంచి ప్రత్యేక కాంబో కట్టర్ తెప్పించి భవనాన్ని కూల్చనున్నారు. ఈ మెషీన్ సాయంతో బిల్డింగ్పై అంతస్థు నుంచి శ్లాబు, గోడలను ముక్కలుగా చేసి కిందకు దింపనున్నారు. 

ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదంలో మిస్సైన ముగ్గురు యువకుల్లో ఇంకా ఇద్దరి మృతదేహాలు లభ్యంకాలేదు. వారి డెడ్ బాడీల ఆనవాళ్ల కోసం ఫైర్ సిబ్బంది బిల్డింగ్ ప్రతి అంతస్థును క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. శనివారం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఓ డెడ్ బాడీకి సంబంధించిన ఎముకలు లభ్యమయ్యాయి. వాటిని సేకరించిన సిబ్బంది పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.