
పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త సినిమా OGపై సంచలన ప్రకటన వచ్చింది. ఈ అనౌన్స్ మెంట్ చేసింది ఎవరో కాదు.. మనం రెగ్యులర్ గా సినిమా టికెట్స్ బుక్ చేసుకునే Book My Show.. అవును.. బుక్ మై షో రిలీజ్ చేసిన ఈ ప్రకటన అందరూ తెలుసుకోవాలి.. లేకపోతే ధియేటర్ కు వెళ్లి ఇబ్బంది పడతారు. ఈ విషయం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OG సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నిబంధన ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ధియేటర్ లోకి ఎంట్రీ ఉంటుంది. 18 ఏళ్లలోపు వాళ్లకు OG సినిమా ధియేటర్లలోకి ఎంట్రీ ఉండదు. ఈ విషయాన్ని గమనించి ఎవరైనా మైనర్లు టికెట్లు బుక్ చేసుకుని ఉంటే.. వాళ్ల టికెట్ డబ్బులు వాపస్ ఇస్తాం.. 2025, సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు మీరు ఈ కింద ఉన్న లింక్ క్లిక్ చేసి మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోండి.. మీ డబ్బులు మీకు వస్తాయి అని ప్రకటించింది.
ALSO READ : అప్పట్లో పంజా.. ఇప్పుడు OG : 14 ఏళ్ల తర్వాత పవన్ మూవీకి A సర్టిఫికెట్
OG సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ వచ్చే ముందుగానే.. బుక్ మై షోలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యింది. దసరా సెలవుల క్రమంలో చాలా మంది తమ పిల్లలతో OG సినిమాకు వెళ్దామని టికెట్ బుక్ చేసుకున్నారు ఫ్యామిలీలు. టికెట్ బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత A సర్టిఫికెట్ అనౌన్స్ మెంట్ రావటంతో.. అలాంటి వారికి తిరిగి డబ్బులు చెల్లించేందుకు బుక్ మై షో ఈ అనౌన్స్ మెంట్ చేసింది. ఈ మేరకు ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వాళ్లకు.. వారి వారి ఫోన్లకు ఇలాంటి మెసేజ్ వస్తుంది.
OG టికెట్స్ బుక్ చేసుకున్న ఫ్యామిలీస్.. మీకే ఈ సమాచారం. పిల్లలతో సినిమా ధియేటర్ కు వెళ్లి గొడవలు చేయొద్దు.. ఇది ప్రభుత్వ నిబంధన అని గుర్తు పెట్టుకోండి.. ఇప్పుడే ఆన్ లైన్ లో మీకు వచ్చిన లింక్ క్లిక్ చేసుకుని మీ టికెట్ డబ్బులు రిటర్న్ తీసుకోండి..