ఓ.. సుకుమారి మూవీ షూటింగ్ కంప్లీట్

ఓ.. సుకుమారి మూవీ షూటింగ్ కంప్లీట్

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ.. సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌‌‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. బుధవారం ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్‌‌‌‌లో దిగిన ఫొటోను విడుదల చేశారు. విలేజ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతున్న ఈ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌కు కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నాడు. సి.హెచ్. కుషేందర్ డీవోపీ. పూర్ణాచారి పాటలు రాస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.