
అమెరికా–చైనాల మధ్య ట్రేడ్ వార్ ఆందోళనలు డాలర్‌ను బలహీనపరుస్తున్నాయి. డాలర్ బలహీనంతో పాటు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్(ఐఎంఓ) షిప్పింగ్ ఫ్యూయల్ నిబంధనలను మార్చేసింది. దీంతో బ్రెట్ క్రూడాయిల్ ధర బ్యారల్‌కు 90 డాలర్లకు చేరుకోనుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనావేస్తోంది. ఐఎంఓ తీసుకొచ్చిన కొత్త షిప్పింగ్ ఫ్యూయల్ నిబంధనల వల్ల క్రూడాయిల్‌కు భారీగా డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా గ్లోబల్ పవర్ జనరేషన్ రంగం నుంచి ఆయిల్‌కు డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పింది. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాబోతున్న ఐఎంఓ నిబంధనల ప్రకారం ఫ్యూయల్స్‌లో ఉండాల్సిన సల్ఫర్ కంటెంట్ 0.5 శాతం కంటే తక్కువగా ఉండాలి. ప్రస్తుతం బంకర్ ఫ్యూయల్‌లో ఉండే సల్ఫర్ కంటెంట్ 3.5 శాతంగా ఉంటోంది. బ్యారల్ ధర 90 డాలర్లకు చేరుకుంటుందని హెచ్చరికలతో పాటు, ఒకవేళ ట్రేడ్ వార్ వినియోగదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తే బ్రెంట్ క్రూడ్ బ్యారల్‌కు 50 డాలర్ల కు పడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా అంచనావేస్తోంది. మధ్య ప్రాచ్యలో మిలటరీ ఆందోళనలు కొనసాగుతున్నాయని మెరిల్ లించ్ పేర్కొంది. సప్లయ్ కోత, మధ్య ప్రాచ్య రవాణాల్లో ఆందోళనలు పెరగడంతో శుక్రవారం ఆయిల్ ధరలు బ్యారల్‌కు 73 డాలర్లకు పెరిగాయి. ‘మధ్య ప్రాచ్య దేశాల్లో మిలటరీ టెన్షన్లు, అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌వార్ ఆందోళనలు వంటి వాటితో ప్రస్తుతం ఆప్షన్ మార్కెట్‌లో ట్రేడ్ అయే దాని కంటే ఎక్కువగానే బ్రెంట్ క్రూడ్ పెరిగే అవకాశాలున్నాయి. అని అభిప్రాయం వ్యక్తం చేసింది.