పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరగనున్నాయా.. రష్యా, సౌదీనే కారణమా..?

పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరగనున్నాయా.. రష్యా, సౌదీనే కారణమా..?

పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరగనున్నాయా.. అందుకు రష్యా,సౌదీనే కారణమా?.. అంటే నిజమే అనిపిస్తోంది. తాజాగా రియాద్, మాస్కో నుంచి వచ్చిన ప్రకటనలతో ట్రేడింగ్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధరను బ్యారెల్ కు 90 డాలర్లకు  చేరింది. 2022 నవంబర్ నుంచి మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగలేదు. 

మంగళవారం ప్రకటన తర్వాత బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 90 డాలర్లకు  పైన ట్రేడవుతోంది. 2022 అక్టోబర్ నుంచి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌ కు 75 నుంచి 85 డాలర్ల  మధ్య ఉంది. అమెరికాకు బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ బ్యారెల్‌ ధర దాదాపు 87 డాలర్లు ట్రేడ్ అయింది. సౌదీలో విజన్ 2030కి నిధులు సేకరణ, ఉక్రెయిన్ తో రష్యా యుద్దం కారణంగా చమురు ధరలు పెంచడం..ఈ ప్రభావం భారత్ పై పడే అవకాశం లేకపోలేదని బిజినెస్ విశ్లేషకులు అంటున్నారు. 

సౌదీ అరేబియా, రష్యాలు ఆయిల్ సరఫరా కోతలను ఈ ఏడాది చివరి పొడిగించింది. దీంతో ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.2 శాతం పెరిగి బ్యారెల్ ధర 90.21 డాలర్ల చేరింది.  2022 నవంబర్ తర్వాత బ్యారెల్ ధర 90 డాలర్లకు కిపైగా చేరడం ఇదే తొలిసారి. ఈ పరిణామంతో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.  

భారత్‌పై ప్రభావం చూపుతుందా?

దేశవ్యాప్తంగా వర్షాలతో రష్యానుంచి భారత్ చమురు దిగుమతి 2023 ఆగస్టులో ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతేకాకుండా ఉక్రెయిన్ తో యుద్దం కారణంగా గతంకంటే చమురు కొనుగోళ్లు 2 శాతం తగ్గాయి. సౌదీ, యూఎస్ నుంచి కూడా చమురు దిగుమతులు తగ్గాయి. భారత్ మొత్తం ముడి చమురు దిగుమతులు ఆగస్టులో 7 శాతం క్షీణించి రోజుకు 4.35 మిలియన్ బ్యారెల్స్ కు తగ్గాయి. ఈ నేపథ్యంలో భారత్ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందా లేదా అనేదానిపై ఎటువంటి నిర్దారణ లేదు. 2024 లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున బీజేపీ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచే అవకాశం లేదని అంటున్నారు  రాజకీయ విశ్లేషకులు.