ఇండియా మార్కెట్‌లోకి ఓలా ఆదివారం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్‌ను రిలీజ్ చేసింది. వీటిలో ఎస్1 రేటు రూ.లక్ష కాగా, ఎస్1 ప్రొ రేటు రూ.1.39 లక్షలు. ఎస్1 మోడల్ 121 కి.మీ, ప్రొ మోడల్ 181 కి.మీ మైలేజ్ ఇస్తాయి. ప్రొ మోడల్ టాప్ వేరియంట్ టాప్ స్పీడ్ 115 కి.మీ కాగా, ఎస్1 టాప్ స్పీడ్ 90 కి.మీ. చార్జింగ్ టైమ్ వరసగా 4.48 గంటలు, 6.30 గంటలు. హైపర్ చార్జింగ్ స్టేషన్లలో అయితే 18 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతాయి. డిజిటల్ కీ, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, జీపీఎస్ నావిగేషన్, థెఫ్ట్ అలారమ్, 4జీ కనెక్టివిటీ వంటి అదనపు ప్రత్యేకతలూ ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే.. బండిని నడిపే వ్యక్తి దగ్గరికి రాగానే స్కూటర్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది.
