చలితో వృద్ధురాలు మృతి..ములుగులో ఘటన

చలితో వృద్ధురాలు మృతి..ములుగులో ఘటన

ములుగు, వెలుగు: చలికి తట్టుకోలేక ములుగులో వృద్ధురాలు చనిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగుకు చెందిన రాస రాధమ్మ(65) నిలువ నీడ లేకపోవడంతో ఆటోనగర్​లోని అంగన్​వాడీ సెంటర్​ షెడ్డులో కొడుకు, మనవడితో కలిసి ఉంటోంది. చలి గాలులతో తీవ్ర అనారోగ్యానికి గురై బుధవారం చనిపోయింది. సొంత ఇల్లు లేకపోవడంతో కాలనీవాసులు రోడ్డు పక్కనే టెంట్​ వేసి డెడ్​బాడీని ఉంచారు. విరాళాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించారు.