పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తం : హిమాచల్ సీఎం

పాత పెన్షన్  విధానాన్ని అమలు చేస్తం : హిమాచల్ సీఎం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాతపెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మరోసారి స్పష్టం చేశారు. పాతపెన్షన్ విధానం అమలుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఇదే అంశంపై ఈనెల 28వ తేదీన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం భేటీ కానున్న నేపథ్యంలో.. ఇవాళ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కొత్త పెన్షన్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో .. లక్ష 20వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ సిస్టం (ఓపీఎస్) అమలు కోసం ఎంతో ఆశగా  ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం సుఖ్విందర్ సింగ్ చేసిన ప్రకటన ఉద్యోగుల ఆశలకు ఊపిరి పోసింది.