
- ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ చైర్మన్ జైన్
బషీర్బాగ్, వెలుగు: పురాతన హిందు దేవాలయాల పరిరక్షణకు పాటుపడతామని అల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆర్.కె.జైన్, ఉపాధ్యక్షుడు జస్మాత్ పటేల్ అన్నారు. నాంపల్లిలోని ఓ హోటల్ లో బుధవారం ఏపీ, కర్నాటక రాష్ట్రాలకు ట్రస్ట్ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రస్ట్ ద్వారా శ్రీలంకలో 3 పురాతన ఆలయాలను పునఃనిర్మించినట్లు తెలిపారు.
తెలంగాణలో వంద పురాతన ఆలయాలను గుర్తించామని, అనుమతి రాగానే వాటి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే, ట్రస్ట్ తరఫున మరో 50 శాతం నిధులను సమకూర్చి ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
దుబాయ్ లో పురాతన శివాలయం మరమ్మతులకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటు నిధులు కేటాయించిందన్నారు. ట్రస్ట్ కు సహకారం అందిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ వివేక్ కు
ధన్యవాదాలు తెలిపారు.