అనాద‌ వృద్ధురాలికి ఆశ్ర‌యం క‌ల్పించారు

అనాద‌ వృద్ధురాలికి ఆశ్ర‌యం క‌ల్పించారు

హైద‌రాబాద్: అనాద వృద్ధురాలికి ఆశ్ర‌యం క‌ల్పించారు అక్ష‌ర పౌండేష‌న్ నిర్వాహ‌కులు. ద‌మ్మాయిగూడ‌, అయ్య‌ప్ప కాల‌నీలోని బ‌స్ ష‌ల్ట‌ర్ ద‌గ్గ‌ర‌ కొన్ని రోజులుగా ఓ వృద్ధురాలు ఒంట‌రిగా ఉంటుంది. ఎవ‌రైనా అన్నం పెడితే తింటూ కాలం గ‌డుపుతోంది. ఆమెకు తెలుగు రాద‌ని.. హిందీలో మాట్లాడుతున్న‌ట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే త‌న‌కు ఎవ‌రూలేర‌ని వృద్ధురాలు చెబుతుంద‌ని.. అయితే ఒక్కోసారి త‌న కొడుతు వ‌దిలేసి పోయాడ‌ని చెప్పిన‌ట్లు స్థానికులు అంటున్నారు.

వృద్ధురాలిని ఎవ‌రైనా ఆదుకోవాలని స్థానికులు కోర‌గా.. ద‌మ్మాయిగూడ వీఆర్ ఓ స్పందించారు. శ‌నివారం అక్ష‌ర ఫౌండేషన్ నిర్వాహ‌కుల‌తో క‌లిసి వృద్ధురాలిని ప్ర‌గ‌తి న‌గ‌ర్ లోని మాధురి ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేశారు. ఇదే విష‌యంపై అక్షర ఫౌండేషన నిర్వాహ‌కుడు రాజు కోట్ల మాట్లాడుతూ.. ఈమెకు అన్ని విధాలుగా సహాయం, సహకారాలు అందిస్తాన‌ని తెలిపారు. అస‌లే క‌రోనా క‌ష్ట‌కాలంలో అండ‌గా నిల‌బ‌డాల్సిన కొడుకులు, బిడ్డ‌లు..వృద్ధురాలిని న‌డి రోడ్డుపై వ‌దిలేసి వెల్ల‌డంపై స్థానికులు మండిప‌డ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..